Ys Jagan : వరస శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి పనులపై దృష్టి సారించారు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. నిన్న విద్యుత్తు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన జగన్ ఈరోజు కూడా కొన్ని పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన పలు పరిశ్రమలకు జగన్ ప్రారంభోత్సవం చేయనున్నారు.
రేపు కడప, నంద్యాల జిల్లాలకు...
ఇప్పటి వరకూ జగన్ సంక్షేమంపైనే దృష్టి పెట్టారన్న పేరు రావడంతో రానున్న కాలమంతా అభివృద్ధిపైనే దృష్టి పెట్టనున్నారు. ఈరోజు మరికొన్న పరిశ్రమలకు ప్రారంభోత్సవాలను చేయనున్నారు. రేపు నంద్యాల, కడప జిల్లాలో పర్యటించనున్న జగన్ నీటి పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన కడప జిల్లాకు వెళ్లి పెద్ద దర్గాను దర్శించుకుంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.