పోలింగ్ శాతం పెరుగుతుందా? వెదర్ రిపోర్ట్ అలా ఉంది మరి
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తమిళనాడులో ఏర్పడిన ద్రోణి కారణంగా రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి వరకూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఓటు వేసేందుకు వస్తారా? లేదా? అన్న అనుమానం రాజకీయ పార్టీల్లో నెలకొంది. అయితే వాతావరణం చల్లగా ఉంటుందని వెదర్ డిపార్ట్‌మెంట్ చెప్పడంతో ఓటింగ్ శాతం పెరగనుందన్న అంచనాలు వినిపడుతు్నాయి.
వర్షాలతో పాటు...
అయితే ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు, తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావం బలంగా ఏర్పడటంతో వర్షాలు మోస్తరుగా కురిసే అవకాశముందని తెలిపింది. గాలి వాన బీభత్సం కూడా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తేలిక పాటి వర్షాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పింది.