ఎన్నికల వేళ ఉద్యోగుల అల్టిమేటం.. సమ్మెకు సిద్ధమంటూ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు మరొకసారి ఆందోళన చేయాలని నిర్ణయించారు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు మరొకసారి ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఈనెల 14వ తేదీ నుంచి ఆందోళన దశలవారీగా చేయాలని నిర్ణయించారు. ఏపీ ఎన్జీవోలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమకు రావాల్సిన డీఏ బకాయీలీతో పాటు వేతనాలు ప్రతి నెల ఒకటోతేదీన చెల్లించాలని కోరుతూ వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తాము అవసరమైతే సమ్మె చేయడానికి కూడా సిద్ధమయని విజయవాడలో సమావేశమైన ఎన్జీవోల సమావేశంలో నిర్ణయించారు.
దశల వారీగా...
104 సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 14న నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించనున్నారు. తర్వాత 15,16 తేదీల్లో లంచ్ టైంటో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. 17న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, 20న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తూనే తమ ఆందోళనలు కొనసాగిస్తామని, అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.