దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

జనవరి నెల ప్రవేశించే సరికి చలి కూడా తీవ్రమయింది. డిసెంబరు నెల చివరి వారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలయింది.

Update: 2022-01-02 02:55 GMT

జనవరి నెల ప్రవేశించే సరికి చలి కూడా తీవ్రమయింది. డిసెంబరు నెల చివరి వారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలయింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో...
ఆంధ్రప్రదేశ్ లోని మినుములూరులో అత్యల్పంగా 9 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, అరకులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తెలంగాణలో సిర్పూరు లో 11.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రెండు రాష్ట్రాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మంచు దట్టంగా అలుముకుంటుంది.


Tags:    

Similar News