నేడు కూడా బార్ల వేలం
ఆంధ్రప్రదేశ్ లో బార్ల లైసెన్సులకు ఈరోజు కూడా వేలం కొనసాగనుంది. కోస్తాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఈ వేలం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో బార్ల లైసెన్సులకు ఈరోజు కూడా వేలం కొనసాగనుంది. కోస్తాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఈ వేలం జరగనుంది. మొత్తం 500 బార్లకు వేలం జరనుంది. బార్ల వేలానికి అనూహ్య స్పందన కన్పిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. తొలిరోజు బార్ల వేలం రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరగగా మంచి స్పందన కనిపించిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. బార్ల వేలంలో పాల్గొంనేందుకు పోటీ పెరగడంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది.
నేడు కోస్తాంధ్రలో.....
తొలి రోజు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 323 బార్లకు వేలం జరగగా, ప్రభుత్వానికి 258 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. కోస్తాంధ్రలో ఇంకా ఎక్కువగా ఉంటుందన్న అంచనాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో బార్ల లైసెన్సుల కోసం కోట్లు వెచ్చిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలోని ఒక బార్ కు కోటి రూపాయలకు పైగా ధర పలకడం విశేషం. ఇక కడపలో ఒక బార్ లైసెన్స్ కోసం 1.89 కోట్ల రూపాయలు వెచ్చించడం గమనార్హం.