కాగ్ నివేదికలో ఆంధ్ర, ఆది కవి నన్నయ యూనివర్సిటీలపై సంచలన వివరాలు

ఆడిట్‌లో భాగంగా, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ వంటి సాధారణ స్ట్రీమ్‌లలో విద్యను అందిస్తున్న 10 రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో, మూడు విశ్వవిద్యాలయాలు

Update: 2022-09-23 11:02 GMT

ఆంధ్ర యూనివర్సిటీ, ఆది కవి నన్నయ యూనివర్సిటీలపై కాగ్ నివేదికలో సంచలన విషయాలు తెలిశాయి. 2014, 2019 మధ్య ప్రభుత్వ ఆధీనంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఆదికవి నన్నయ (ఎకెఎన్) విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల సగటు ఉత్తీర్ణత శాతం 18, 15 శాతంగా ఉన్నాయి. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) మార్గదర్శకాల ప్రకారం విశ్వవిద్యాలయాలలో మంచి విద్యకు సంబంధించి ఆందోళలనకరమైన గణాంకాలు బయటకు వచ్చాయని కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (CAG) ఒక నివేదికలో వెల్లడించింది. "Performance Audit of Outcomes in Higher Education in Andhra Pradesh" అనే రిపోర్టులో ఈ వివరాలను తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ముందు ఉంచారు. నివేదిక ప్రకారం, 2014-19 కాలంలో ఆంధ్రా యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి సగటు ఉత్తీర్ణత శాతం 18-46 శాతం మధ్య ఉంది.

2018-19 సంవత్సరంలో బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం వరుసగా 23.49 శాతం, 23.54 శాతం, 36.39 శాతంగా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి, ఇదే కాలంలో సగటు ఉత్తీర్ణత శాతం 47.52, 90.13 శాతం మధ్య ఉంది. MCom లో ఉత్తీర్ణత శాతం క్రమంగా తగ్గింది. 2014-15లో 90.13 శాతం ఉత్తీర్ణత సాధించగా, 2018-19లో 53 శాతానికి తగ్గింది. AKN విశ్వవిద్యాలయంలో, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి సగటు ఉత్తీర్ణత శాతం 15 - 52 శాతం మధ్య ఉంది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో బీఏ కోర్సులో ఉత్తీర్ణత శాతం 32.78 నుంచి 19.27 శాతానికి, బీఎస్సీలో 38.04 నుంచి 37.85 శాతానికి, బీకామ్‌లో 40.58 నుంచి 21.77 శాతానికి తగ్గింది. AKNUలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి సగటు ఉత్తీర్ణత శాతం 2014-15 నుండి 2018-19 మధ్య కాలంలో 57 - 80 శాతం మధ్య ఉంది. ఎంఎస్సీలో ఉత్తీర్ణత శాతం 2014-15లో 70.58 శాతం ఉండగా 2018-19లో 60.90 శాతానికి తగ్గింది.
CAG ఆడిట్ చేసిన వర్సిటీలలో, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో మంచి ఫలితాలు సాధించింది. SVUలో, 2016-17 నుండి 2018-19 మధ్య కాలంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో సగటు ఉత్తీర్ణత శాతం 98 శాతంగా ఉంది. 2014-15 నుండి 2018-19 మధ్య కాలంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి సగటు ఉత్తీర్ణత శాతం 82- 100 శాతం మధ్య ఉంది.
CAG నవంబర్ 2019- మార్చి 2020 మధ్య 2014-15 నుండి 2018-19 మధ్య కాలానికి సంబంధించి పనితీరుకు సంబంధించి ఆడిట్‌ను నిర్వహించింది, విద్యార్థులకు ఉన్నత చదువులకు కావాల్సిన విద్య నాణ్యతను అంచనా వేసింది. ఆడిట్‌లో భాగంగా, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ వంటి సాధారణ స్ట్రీమ్‌లలో విద్యను అందిస్తున్న 10 రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో, మూడు విశ్వవిద్యాలయాలు - ఆంధ్రా విశ్వవిద్యాలయం, SVU మరియు AKN విశ్వవిద్యాలయాలు - ఆడిట్ పరిశీలన కోసం ఎంపిక చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2018-19 నాటికి 1,432 అనుబంధ డిగ్రీ కళాశాలలతో 10 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.


Tags:    

Similar News