శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు హల్ చల్
శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగలపుట్టుగ సముద్ర తీరంలో ఎలుగుబంట్లు కనిపించాయి.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగలపుట్టుగ సముద్ర తీరంలో ఎలుగుబంట్లు కనిపించాయి. సముద్ర తీరంలో అవి స్నానమాడుతూ కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు తిరుగుతుండటంతో మత్స్యకారులు, సందర్శకులు భయంతో పరుగులు తీశారు.
దాడులు చేస్తాయని...
ఇటీవల కాలంలో ఎలుగుబంట్లు మనుషులపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఏ వైపు నుంచి వచ్చి అవి దాడులు చేస్తాయోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్లు సంచారం పై కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు స్థానికులు కోరుతున్నారు.