వైసీపీకి భారీ షాక్.. ఆ నేత రాజీనామా

వెంకటేష్ ఏదో అవినీతి చర్యకు పాల్పడినందునే అతడిని దూరంగా పెడుతున్నట్లు దాడిశెట్టి రాజా బహిరంగంగానే చెప్పారు.

Update: 2023-06-09 05:18 GMT

ఏపీలో వైఎస్సార్సీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరోనేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. తుని నియోజకవర్గంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంటకేష్ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. వైసీపీ స్థాపించినప్పటి నుంచి వెంకటేష్ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. మంత్రి దాడిశెట్టి రాజాకు అన్నీ తానై వ్యవహరించారు. ఇటీవల కాలంలో వెంకటేష్ ను రాజా దూరం పెట్టడంతో.. వెంకటేష్ పార్టీకి రాజీనామా చేసిన లేఖను అధిష్టానానికి పంపారు.

అయితే.. వెంకటేష్ ఏదో అవినీతి చర్యకు పాల్పడినందునే అతడిని దూరంగా పెడుతున్నట్లు దాడిశెట్టి రాజా బహిరంగంగానే చెప్పారు. ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం సహించదన్న రాజా.. తమని తాము సమర్థించుకున్నా.. ప్రజలకు మాత్రం మరోలా అర్థమైంది. రెండు ఎన్నికల్లోనూ రాజా విజయానికి కీలకంగా పనిచేసిన వెంకటేష్ ను దూరం పెట్టడం ఏంటని పార్టీ క్యాడర్ లోని వారినుంచే విమర్శల గళం వినిపిస్తోంది. ఇన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న మోతుకూరు వెంకటేష్.. ఇప్పుడు వైసీపీని వీడడంతో.. నెక్ట్స్ ఆయన ఏ పార్టీలో చేరతారన్నదానిపై చర్చ జరుగుతుంది. వెంకటేష్ నుంచి రాజాకు గట్టిపోటీ ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.


Tags:    

Similar News