అందుకే పొత్తుల ప్రస్తావన తెస్తున్నారు

ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ను టీడీపీ వద్దనడం సరికాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు

Update: 2022-09-04 08:25 GMT

ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ను టీడీపీ వద్దనడం సరికాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పడం యనమల రామకృష్ణుడు వ్యక్తిగత విషయమా? లేక టీడీపీ విధానమా? అన్నది చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమలను అడ్డుకునేందుకు వైసీపీ, టీడీపీలు ఏపీలో పోటీ పడుతున్నాయని ఆయన అన్నారు. ఎన్డీబీ ప్రాజెక్టులో భాగంగా తన వాటాగా నిధులివ్వడానికి కేంద్రం సిద్ధపడిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద నిధులు లేవని చేతులెత్తేసిందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఆరు వేలకోట్ల నిధులు మురిగిపోతున్నాయని ఆయన ఆవేదన చెందారు.

యాభై లక్షలు చెల్లించాలి.....
చిత్తూరు జిల్లాలో రైతు ప్రభుత్వ కార్యాలయంలో చనిపోవడం బాధాకరమని అన్నారు. రైతుకుటుంబానికి యాభై లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే జరిగిందని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. విద్యా మాఫియా వైసీపీ ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉందన్నారు. ప్రయివేటు స్కూళ్లలో పేదలకు సీట్లివ్వాలన్న నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉందన్నారు. పొత్తులపై నిర్ణయం తీసుకునేది హైకమాండ్ మాత్రమేనని, వారి పార్టీల నుంచి బీజేపీలో చేరకుండా అడ్డుకునేందుకే వైసీపీ, టీడీపీలు పొత్తుల ప్రస్తావన తెస్తున్నాయన్నారు.



Tags:    

Similar News