BJP : బీజేపీ నుంచి పెద్దల సభకు ఆర్. కృష్ణయ్య
రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య పేరును బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది.
రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య పేరును బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య పేరును ఖరారు చేసింది. మొత్తం మూడు రాష్ట్రాలా నుంచి రాజ్యసభ అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. హర్యానా నుంచి రేఖాశర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్, ఏఫీ నుంచి ఆర్ కృష్ణయ్య పేర్లను ఖరారు చేసింది.
రేపు నామినేషన్ దాఖలు చేయడానికి...
రాజ్యసభ ఎన్నికలకు రేపు నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరి గడువు కావడంతో నేడు ఈరోజు బీజేపీ నాయకత్వం మూడు పేర్లను పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ఈరోజు సాయంత్రం ఆర్ కృష్ణయ్య విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.