కీలక కమిటీలో సోముకు చోటు
బీజేపీ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తుంది. నేతలను కూడా రంగంలోకి దించుతుంది.
బీజేపీ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తుంది. నేతలను కూడా రంగంలోకి దించుతుంది. ఎన్నికల వ్యూహాలను రచించేందుకు కమిటీని నియమిస్తూ పార్టీ అధినాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను, ఎత్తుగడలను నిర్ణయించే పనిని ఈ కమిటీ చేపట్టనుంది. ఇందుకోసం 26 మంది నేతలతో ఒక కమిటీని నియమించింది.
ఎన్నికల కమిటీలో...
భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీని నియమించింది. 26 మందితో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో ఐదుగురు కేంద్రమంత్రులున్నారు. కేంద్ర మంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలకు కూడా అవకాశం కల్పించింది. ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డిని నియమించింది.