జగన్ సర్కార్ కు సీఎం రమేష్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీసు వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తుందన్నారు. ఏపీలో పోలీసుల వైఖరి అభ్యంతరకరంగా ఉందన్నారు సీఎం రమేష్. ఏపీ పోలీసుల పనితీరును కేంద్ర ప్రభుత్వం టెలిస్కోప్ తో చూస్తుందన్నారు. నిబంధనల ప్రకారం పోలీసులు వ్యవహరించకుండా అధికార పార్టీకి వత్తాసుగా మారుతున్నారని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఏపీ పోలీసు ఉన్నతాధికారులను రీకాల్ చేస్తుందని వ్యాఖ్యానించారు.
అవసరమైతే రీకాల్.....
పోలీసులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని సీఎం రమేష్ తెలిపారు. ఇందుకు రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందన్నారు. ఏపీలో ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని అవలంబిస్తుందని అన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి ఇతర వ్యాపకాలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు. విపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, కేంద్రం చూస్తూ ఊరుకోదని సీఎం రమేష్ ఏపీ పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు.