"మూడు" రాజధానుల బిల్లు సాధ్యం కాదు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో మూడు రాజధానుల మాట దేవుడెరుగు మూడు బిల్దింగ్ లు కట్టారా? అని ఆయన ప్రశ్నించారు. బిల్లును తీసుకొస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి రాజకీయ క్రీడను ప్రభుత్వం ప్రారంభించిందని జీవీఎల్ నరసింహారావు అన్నారు.
శ్వేత పత్రం విడుదల చేయాలి....
రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని, ఈ విషయాన్ని పార్లమెంటులోనే ఈ విషయాన్ని స్పష్టత నిచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయంలో జోక్యం చేసుకోదని చెప్పామని, అలాగే న్యాయవ్యవస్థకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిల్లు తెచ్చే అవకాశం లేదన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన రాజకీయ ఎత్తుగడ అని ఆయన అన్నారు. ప్రజలను తప్పు దోవ పట్టించేందుకే చర్చలు పెడుతున్నారన్నారు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కంటే ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మెరుగ్గా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.