Penamaluru : పోటీ చేయడం ఖాయం... రాసి పెట్టుకోండి
పెనమలూరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని బోడీ ప్రసాద్ ప్రకటించారు
పెనమలూరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని బోడీ ప్రసాద్ ప్రకటించారు. రెండో జాబితాలోనూ ఆయన పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించలేదు. పెనమలూరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమ పోటీ చేస్తారన్న ప్రచారంతోనే ఆయన పేరును ప్రకటించలేదని చెబుతున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈసారి టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని బోడే ప్రసాద్ కు సమాచారం తెలియజేయడంతో ఆయన అనుచరులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
పార్టీ బలోపేతం కోసం...
దీంతో బోడే ప్రసాద్ అనుచరులతో సమావేశం నిర్వహించారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. చివరి నిమిషం వరకూ చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులు తనకు ఉంటాయనే తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. తాను గత ఐదేళ్లుగా పెనమలూరులో పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. కరోనా కష్టసమయంలోనూ తాను ప్రజల్లోనే ఉన్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తాను కోటి రూపాయలు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.