Tiruputhi : తిరుపతిలో హోటళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు

తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఈరోజు కూడా ఎనిమిది హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి;

Update: 2024-10-30 03:58 GMT
bomb threats in tirupati, eight hotels received bomb threat mails today, tirupati bomb threats news today,  bomb threat mails in tirupati hotels

 bomb threats in tirupati

  • whatsapp icon

తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఈరోజు కూడా ఎనిమిది హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఐఎస్ఐ నుంచి ఈ బెదిరింపులు రావడంతో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. హోటళ్లలో బాంబు తనిఖీలను పోలీసులు చేపట్టారు. ఎనిమిది హోటల్స్ లోనూ తనిఖీలు చేసిన తర్వాత అవి ఉత్తుత్తి బాంబు బెదిరింపులేనని చివరకు తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గత కొద్ది రోజులుగా...
తిరుపతిలో గత కొద్ది రోజులుగా హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ నుంచి ఈ బెదిరింపులు వస్తున్నాయని పోలీసులు తెలిపారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తిరుమలకు వెళ్లే భక్తులను బెదిరించడానికే ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని తెలిపారు.


Tags:    

Similar News