వియ్యంకులు కాబోతోన్న టిడిపి నేతలు.. చంద్రన్న సమక్షంలో ప్రేమ పెళ్లి
ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతితో.. బోండా ఉమా కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం జరగనుంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబును
అమరావతి : ఏపీలో రాజకీయ నేతలు వియ్యంకులుగా మారుతున్నారు. ఇటీవల వైసీపీ నేతలు కొలుసు పార్థసారథి, బుర్రా మధుసూదన్ యాదవ్ లు వియ్యమొందారు. తాజాగా టిడిపికి చెందిన మరో ఇద్దరు నేతలు తమ పిల్లల వివాహంతో వియ్యంకులుగా మారనున్నారు. ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతితో.. బోండా ఉమా కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం జరగనుంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు ఇరువురు నేతలు.. తమ పిల్లలతో కలిసి టిడిపి అధినేత చంద్రబాబును కలిశారు.
చంద్రబాబును కలిసిన ఫొటోలను జస్వంతి ట్విట్టర్లో పెట్టడంతో.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. కాగా.. జస్వంతి - సిద్ధార్థ్ అమెరికాలో చదువుకున్నారు. ఎన్నారై టీడీపీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పగా.. వాళ్లూ పెళ్లికి అంగీకరించారు. ఈనెల 27న వీరిద్దరికీ నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుకకు చంద్రబాబు నాయుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు జస్వంతి సోషల్ మీడియా ద్వారా తెలిపింది.