అడవిలో పాపం పసివాడు

రాత్రంతా ఒక పసివాడు అడవిలోనే ఉన్నాడు. దారితప్పిపోయి అడవిలోకి వెళ్లిన బాలుడిని ఎట్టకేలకు అటవీ సిబ్బంది రక్షించారు.

Update: 2023-01-04 06:18 GMT

రాత్రంతా ఒక పసివాడు అడవిలోనే ఉన్నాడు. దారితప్పిపోయి అడవిలోకి వెళ్లిన బాలుడిని ఎట్టకేలకు అటవీ సిబ్బంది రక్షించారు. దీంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కడప జిల్లాలో పోరుమామిళ్ల మండలం కలవవకుంట్ల అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు సుమంత్ తన తండ్రితో కలిసి అడవిలో పశువుల మేతకు తీసుకెళ్లాడు. అయితే తండ్రి నుంచి అడవిలో తప్పి పోయిన బాలుడు ఎక్కడ చిక్కుకున్నాడో తెలియదు.

జంతువుల అరుపులతో...
దీంతో తండ్రి వచ్చి గ్రామస్థులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా గాలించినా బాలుడు దొరకలేదు. ఒంటరిగా ఉన్న సుమంత్ ను అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. బాలుడిని రక్షించి తీసుకువచ్చారు. సుమంత్ ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. రాత్రంతా అడవిలో ఒంటరిగా గడిపిన సుమంత్ ఎలా ఉండగలిగాడోనని గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఎలాంటి జంతువుల బారి పడకుండా సురక్షితంగా ఉన్నందుకు దేవుళ్లను మొక్కుకున్నారు. సుమంత్ ను ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.


Tags:    

Similar News