Thirumala : ఈరోజు రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యల భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్వవాల సమయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యల భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మారు మోగిపోతున్నాయి. ఈరోజు ఉదయం స్వర్ణ రధంపై స్వామి వారు మాడవీధుల్లో ఊరేగారు. రాత్రి ఏడు గంటలకు అశ్వ వాహనంపై ఊరేగననున్నారు. మాడ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది.
ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పదకొండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,422 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 33,212 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాంయ 2.84 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.