బుడమేరు... వివరణ ఇచ్చిన ప్రభుత్వం..!!
విజయవాడలో మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఊపందుకున్నాయి... బుడమేరుకి మళ్లీ గండి పడింది అనే ప్రచారం కూడా శనివారం రాత్రి విసృతంగా సాగింది..
విజయవాడలో మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఊపందుకున్నాయి... బుడమేరుకి మళ్లీ గండి పడింది అనే ప్రచారం కూడా శనివారం రాత్రి విసృతంగా సాగింది.. దీంతో విజయవాడలోని కొన్ని కాలనీల ప్రజలు భయాందోళనలకు గరై రోడ్ల మీదకు వచ్చారు..
వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం... రంగంలోకి దిగి.. పోలిసులతో కలిసి అక్కడ ప్రజల్లో... ధైర్యం నింపే ప్రయత్నాలు మొదలు పెట్టింది... జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని... ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని, ఇటువంటి ఫేక్ వార్తలను ప్రచారం చేసి ప్రజలను భయాందోళనలకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది..!!!
కాగా ఇటీవల విజయవాడలో పోటెత్తిన వరదల గురించి మనందరికీ తెలిసిందే.. కనీసం ఒక వారం రోజులపాటు.. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తిండీ తిప్పలు నీరు కోసం ఎలా పరితపించారో మనందరం చూసిందే..భారీ ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది..!! ఇప్పుడిప్పుడే ఆ షాక్ లోనుంచి తేరుకుని బయటకు రావటానికి ప్రయత్నిస్తున్నారు..
శనివారం రాత్రి మళ్ళీ వరదలు వస్తున్నాయి అని విసృతంగా ప్రచారం జరగడంతో..వారిలో ఆందోళన నెలకొంది..అదంతా ఫేక్ అని అధికారులు తేల్చి చెప్పడంతో...ఊపిరి పీల్చుకున్నారు..!!
బుడమేరుకి మళ్లీ గండి పడింది అని వస్తున్న వదంతులను నమ్మవద్దని, బుడమేరుకి ఎలాంటి వరద నీరు రావటం లేదని స్పష్టం చేశారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ..!!
మంత్రి నారాయణ కూడా వీటిని నమ్మవద్దని,అదంతా ఫేక్ ప్రచారం అని ప్రకటించారు..!!