పది రోజులే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పదిరోజులు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది

Update: 2023-03-14 07:19 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పదిరోజులు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీ వరకూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత నెలాఖరు వరకూ అనుకున్నప్పటికీ ఈ నెలాఖరులో విశాఖపట్నంలో జీ 20 సదస్సు జరుగుతుండటంతో ముందుగానే సమావేశాలు ముగించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.

బడ్జెట్ ప్రసంగానికి...
రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 16వ తేదీన శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 19 ఆదివారం, 23న ఉగాది పండగ సందర్భంగా అసెంబ్లీకి సెలవులుంటాయి. మిగిలిన రోజుల్లో సభ యధాతధంగా నడుస్తుంది.


Tags:    

Similar News