ఈ పాలన మాకొద్దు : ట్రెండింగ్ లో బైబై వైఎస్ జగన్
ప్రజలను ఆదుకోవాల్సిన సర్కారే.. ఇలా భారం మోపుతుంటే భరించలేక.. ఈ పాలన మాకొద్దు. ఈ సీఎం మాకొద్దు అంటూ ..;
విజయవాడ : ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ పాలన ప్రజలకు విసుగు తెప్పిస్తోంది. పెరుగుతున్న నిత్యావసరాలతో.. అంతంత మాత్రంగా వస్తున్న జీతాలతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న ప్రజలపై.. ప్రభుత్వం మరింత భారాన్ని మోపుతోంది. ఓ వైపు పెట్రోల్, డీజిల్ రేట్లు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలనూ పెంచింది.
ప్రజలను ఆదుకోవాల్సిన సర్కారే.. ఇలా భారం మోపుతుంటే భరించలేక.. ఈ పాలన మాకొద్దు. ఈ సీఎం మాకొద్దు అంటూ ప్రజలు ట్వీట్లు చేస్తున్నారు. అలా ప్రభుత్వ పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 31 వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి. దాంతో #ByeByeYSJagan హ్యాష్ టాగ్ ట్విట్టర్ ఇండియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ముఖ్యంగా కరెంట్ కోతలపై నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వాపోతున్నారు.