పోసానిపై కేసు నమోదు

ఏపీ‌ఎఫ్‌డీసీ చైర్మెన్, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో కేసు;

Update: 2023-10-03 08:59 GMT
PosaniKrishnaMurali, Janasena, Pawankalyan, Pawan, Posani,
  • whatsapp icon

ఏపీ‌ఎఫ్‌డీసీ చైర్మెన్, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు జనసేన కార్యకర్తలు. దీంతో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడ పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2021లో హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. పోసాని కృష్ణమురళిపై ఆ సమయంలో జనసేన కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ విషయమై జనసేన, పోసాని కృష్ణమురళిలు పరస్పరం హైద్రాబాద్ పంజాగుట్టలో ఫిర్యాదు చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ పై పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పోసానిపై గతంలో రాజమండ్రికి చెందిన జనసేన నేతలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసేందుకు అంగీకరించకపోవడంతో జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో పోసానిపై కేసు నమోదు చేశారు. 2022లో కూడా పోసానిపై జనసేన పార్టీ రాజమహేంద్రవరం నేత యందం ఇందిరా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.


Tags:    

Similar News