వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి హైకోర్టులో రిలీఫ్
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.;

రాజంపేట మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఏప్రిల్ 3వ తేదీ వరకూ మద్యం కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. ఎటువంటి తొందరపాటు చర్యలకు దిగవద్దని తెలిపింది. తనను మద్యం కేసులో అరెస్ట్ చేయవద్దంటూ ఎంపీ మిధున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేయడంతో దానిపై విచారణ హైకోర్టు జరిపింది.
తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ...
అయితే ఇంకా దీనిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు గతంలోనే న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు. నేడు దీనిపై విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ మూడో తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.