Srisailam : నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు
శ్రీశైలంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.;

శ్రీశైలంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. గురువారం నుంచి ఐదు రోజుల పాటు శ్రీశైలంలోని మల్లికార్జున భ్రమారాంబికా ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈ మహోత్సవాలకు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వార్లను దర్శించుకుంటారు. అందుకే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐదు రోజుల పాటు...
ఉత్సవాల్లో ప్రతి రోజూ స్వామి, అమ్మవార్లకు వాహనసేవలను నిర్వహిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవ మూర్తులను గ్రామోత్సవం రాత్రి ఏడు గంటల నుంచి నిర్వహిస్తామని తెలిపారు. అధిక సంఖ్యలో ఇప్సటికే కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తుండటంతో శ్రీశైల పుణ్య క్షేత్రం భక్తులతో మారుమోగిపోతుంది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి కాలినడకన కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తున్నారు.