Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో కులగణన

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కులగణన ప్రారంభం కానుంది. ప్రతి గ్రామంలో వాలంటీర్లు ఈ కులగణనను నిర్వహించనున్నారు.;

Update: 2024-01-19 03:48 GMT
Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో కులగణన
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కులగణన ప్రారంభం కానుంది. ప్రతి గ్రామంలో వాలంటీర్లు ఈ కులగణనను నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి పది రోజుల పాటు కులగణన జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ వరకూ కులగణన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతలో ఆరు జిల్లాల పరిధిలో ఏడు సచివాలయల పరిధిలో ప్రయోగాత్మకంగా కులగణనను చేపట్టారు.

పది రోజుల పాటు...
ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన జరుగుతుంది. ఆన్ లైన్ లోనే కులగణన వివరాలను నమోదు చేయనున్నారు. ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు వివరాలు సేకరించనున్నారు. ఇంటి వద్ద అందుబాటులో లేని వారు ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకూ సచివాలయాల్లో నమోదు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ ను రూపొందించి అందులో నమోదు చేస్తున్నారు.


Tags:    

Similar News