సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎర్రగంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని పిటీషన్ వేసింది

Update: 2022-07-25 06:01 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎర్రగంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ పిటీషన్ దాఖలు చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయనకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టులో కూడా సీబీఐకి చుక్కెదురయింది. సీబీఐ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.

వివేకా హత్య కేసులో...
దీంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై బయటకు వస్తే సాక్షులకు ఇబ్బంది ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ త్వరలో జరగనుంది.


Tags:    

Similar News