ఆమంచికి సీబీఐ నోటీసులు

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ మరోసారి నోటీసులు అందించింది. రేపు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

Update: 2022-06-21 07:28 GMT

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ మరోసారి నోటీసులు అందించింది. రేపు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆమంచి కృష్ణమోహన గతంలో న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సీఆర్పీసీ 41 ఎ సెక్షన్ కింద ఈ నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు.

గతంలోనూ...
గతంలో ఇదే కేసులో ఆమంచి కృష్ణమోహన్ సీబీఐ అధికారులు హాజరయ్యారు. అప్పుడు విచారించిన సీబీఐ అధికారులు ఆమంచిని ప్రశ్నించారు. మరోసారి ఆమంచిని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నెల 22న హాజరుకావాలని సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.


Tags:    

Similar News