మరోసారి పిలుస్తామన్నారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని నాలుగున్నర గంటలకు పైగా సీబీఐ అధికారులు విచారించారు

Update: 2023-01-29 02:08 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని నాలుగున్నర గంటలకు పైగా సీబీఐ అధికారులు విచారించారు. మరోసారి అవసరమైతే పిలుస్తామని విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ అధికారులు చెప్పారని అవినాష్ రెడ్డి అనంతరం మీడియాకు తెలిపారు. తాను సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు అన్నింటికి సమాధానాలు ఇచ్చానని ఆయన తెలిపారు. తనకు తెలిసిన సమాచారాన్ని సీబీఐ అధికారులకు వివరించానని తెలిపానని చెప్పారు.

అందుకే అడిగా...
అయితే తాను అడిగినట్లుగా వీడియో, ఆడియో రికార్డింగ్ కు మాత్రం అనుమతించలేదన్నారు. న్యాయవాదిని కూడా తన వెంట లోపలకి అనుమతించలేదని అన్నారు. తన విచారణ వక్రీకరణ జరగకుండా ఉండేందుకే తాను వీడియో రికార్డింగ్ చేయాలని కోరానని ఆయన తెలిపారు. గత కొంతకాలంగా ఒక వర్గం మీడియా ఈ హత్య కేసులో తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నందున తాను కోరాల్సి వచ్చిందన్నారు. మరోసారి విచారణకు పిలిచి వచ్చినా వచ్చి వారికి సహకరిస్తానని తెలిపారు.


Tags:    

Similar News