వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సీీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది

Update: 2023-02-18 13:29 GMT

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సీీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు వచ్చి తమకు సహకరించాల్సిందిగా సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నెల 24న హాజరు కావాలంటూ...
ఈ మేరకు వాట్సాప్ ద్వారా సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపారు. గత నెల 28వ తేదీన ఇప్పటికే ఒకసారి సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించారు. వైఎస్ వివేకాందరెడ్డి హత్యకు సంబంధించి పలు అంశాలపై ఆయనను ప్రశ్నించారు. మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News