Ap Elections : ఏపీకి భారీగా చేరుకుంటున్న కేంద్ర బలగాలు
ఏపీకి ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసిన నేపథ్యంలో కేంద్ర బలగాలు దిగాయి.
ఏపీకి ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసిన నేపథ్యంలో కేంద్ర బలగాలు దిగాయి. జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరిక జారి చేసిన నేపథ్యంలో కేంద్ర బలగాలు ఏపీకి చేరుకున్నాయి. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఇంటలిజెన్స్ సూచించిన సంగతి తెలిసిందే. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలన్న ఇంటెలిజెన్స్ పేర్కొంది. దీంతో ఏపి కి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి.
పోలింగ్ అనంతరం...
రాష్ట్రానికి ఇప్పటికే 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి. నేడు మరిన్ని బలగాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. తాడిపత్రిలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించాయి. ఎన్నికల అనంతర దాడులతో తాడిపత్రికి బలగాలు చేరుకున్నాయి. ఈసీ ఆదేశాల మేరకు తాడిపత్రికి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చింది. తాడిపత్రిలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసులు కవాతు చేపట్టింది. మరిన్ని బలగాలు సమస్యాత్మక ప్రాంతాలకు నేడు చేరుకుంటాయి.