పోలవరంపై కేంద్రం మరో కొర్రీ
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేస్తూనే ఉంది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేస్తూనే ఉంది. జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ కొర్రీలు, మెలికలతో పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తుంది. తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో మరో మెలిక పెట్టింది. సామాజిక, ఆర్థిక సర్వేను మరోసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం షరతులు విధించడం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టడంలో ఒక భాగమేనంటున్నారు.
నిబంధనలు.. షరతులు....
డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ పై డీపీఆర్ ను ఖచ్చితంగా తయారు చేయాల్సిందేనని నిబంధన కేంద్ర ప్రభుత్వం పెట్టింది. లోక్ సభలో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సమాధానం రావడంతో వారు అవాక్కయ్యారు. ప్రాజెక్టు ఎప్పడు పూర్తి చేస్తారో చెప్పాలని కూడా కేంద్ర జలశక్తి శాఖ కోరింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుకు సంబంధించి 15,668 కోట్లు చెల్లించడం వరకే తమ బాధ్యత లని, ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై పెట్టిన ఖర్చు 14,336 కోట్లు మాత్రమేనని, అందులో తాము 12,311 చెల్లించామని పేర్కొంది.