ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారాన్ని కోరుతూ కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ అందింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీపురం - కోదాడ గ్రామాల మధ్యలో ఈ బల్క్ డ్రగ్ ఏర్పాటు కానుంది. బల్క్ డ్రగ్ పార్క్ కు సంబంధంచి డీపీఆర్ ను 90 రోజుల్లోగా పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది.
పోటీ పడినా..
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాసూటికల్ విభాగం నుంచి ఏపీ చీఫ్ సెక్రటరీకి ఈ మేరకు లేఖ అందింది. వారం రోజుల్లోగా ఈ పార్క్ ను చేపట్టేందుకు అంగీకరిస్తూ లేఖ పంపాలని కోరింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే చివరకు ఏపీకి అది దక్కింది. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.