పోలవరంపై కేంద్రం మరో కొర్రీ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల విడుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక మెలిక పెడుతూనే ఉంది.

Update: 2022-03-20 01:02 GMT

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల విడుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక మెలిక పెడుతూనే ఉంది. తాజాగా ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి అయిన లెక్కల వివరాలను కేంద్రం అడుగుతోంది. 2004 నుంచి లెక్కలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చికాకు పెడుతోంది. తొలిదశలో నీరు నిల్వ చేసి పోలవరం కుడి, ఎడమ కాల్వల నుంచి నీళ్లు ఇవ్వాలంటే పునరావాసానికి ఎంత ఖర్చవుతుందో తెలపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది.

తొలిదశ నుంచి లెక్కలు....
2014లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అప్పటి నుంచి ఏదో ఒక కొర్రీలు వేస్తూనే ఉంది. నిధుల విషయంలో నానుస్తూ తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీర్లు అసలు పనిని వదిలేసి లెక్కలు కట్టే పనిలోనే ఉన్నారు. కొందరు ఢిల్లీలోనే మకాం వేసి కేంద్రం అడిగిన లెక్కలను సమర్పిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తొలి దశ పేరుతో లె్కలు కట్టిస్తుండటం అధికారులకు సయితం చికాకు తెప్పిస్తుంది.


Tags:    

Similar News