జగన్ ఢిల్లీ టూర్ తో మారిన సీన్
ఆంధ్రప్రదేశ్ లో సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది
ఆంధ్రప్రదేశ్ లో సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. జగన్ ఇటీవల ఢిల్లీ టూర్ తర్వాత వేగంగా పరిణామాలు మారాయి. సమస్యలను సత్వరం పరిష‌్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యానాధ్ దాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ లు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
రేపు కీలక సమావేశం....
వీరంతా రేపు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏపీ భవన్ లో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, ఇతర విభజన అంశాలపై ఈ కమిటీ చర్చించనుంది. ప్రధానంగా ఆర్థిక అంశాలపై చర్చ జరనున్నట్లు చెబుతున్నారు. జగన్ ఢిల్లీలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కొన్ని సమస్యల గురించి ప్రస్తావించి వచ్చారు. మోదీ జోక్యంతోనే రేపు జరగనున్న ఈ సమావేశంలో కొంత రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు.