పోలవరం ఆలస్యం.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశముందని పేర్కొంది. పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. పునరావాస కార్యక్రమాలు కూడా ఆలస్యమవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
సవరించిన అంచనాల్లో.....
పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి నీటి పారుదల పనులకు మాత్రమే నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కారణంగా ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతుందని తెలిపింది. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని, మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. సవరించిన అంచనాల్లో కేవలం 35,950 కోట్లకు మాత్రమే రివైజ్డ్ ఎస్టిమేట్ కమిటీ ఆమోదించిందని తెలిపింది.