ప్రత్యేక హోదా ప్రసక్తిలేదు.. స్పష్టం చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లోక్ సభలో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు వైసీపీ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణకు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా గురించి 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
పన్నుల వాటాను.....
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని నిత్యానంద్ రాయ్ తెలిపారు. విభజన చట్టంలో ఉన్న హామీలలో చాలా వరకూ నెరవేర్చామని, ప్రత్యేక హోదా ఆందప్రదేశ్ కు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన తెలిపారు.