ప్రత్యేక హోదాపై మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

Update: 2022-07-19 12:27 GMT

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా పై కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ లిఖతపూర్వకంగా సమాధానం చెప్పారు. 14, 15 ఫైనాన్స్ కమిషన్ సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక మోదా రాష్ట్రాల మధ్య తేడాను ఏమీ చూపించలేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

రెవెన్యూ లోటు మాత్రం....
అయితే ఏపీకి కావాల్సిన రెవెన్యూ లోటును మాత్రం ఇచ్చామని తెలపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అనేక అంశాలను తాము పూర్తి చేశామని నిత్యానందరాయ్ తెలిపారు. 14వ ఆర్థిక సంఘం పన్నులోల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచిందని మంత్రి తెలిపారు. అనంతరం 41 శాతానికి సర్దుబాటు చేసిందదని తెలిపింది. విభజన చట్టం అమలుపై తాము ఇప్పటికే 28 దఫాలుగా సమావేశాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా అనేది ఇక ముగిసిన అధ్యాయమేనని ఆయన చెప్పారు.


Tags:    

Similar News