కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించే దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టింది.

Update: 2022-02-12 05:00 GMT

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించే దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలను తొలిగించేందుకు త్రిసభ్య కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది.

తెలుగు రాష్ట్రాల్లో....
ఈ కమిటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. ఈ త్రిసభ్య కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 17వ తేదీన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం జరగనుంది.


Tags:    

Similar News