జగన్ ను కలిసిన చాగంటి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు కలిశారు.;

Update: 2023-02-16 13:29 GMT
జగన్ ను కలిసిన చాగంటి
  • whatsapp icon

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు కలిశారు. ఇటీవల చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వం టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో తనను కలిసిన చాగంటి కోటేశ్వరరావును సత్కరించి వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందించి జగన్ సత్కరించారు.

గోశాలను దర్శించి...
చాగంటి కోటేశ్వరరావుతో పాటు శాంతా బయోటిక్స్ లిమిటెడ్ ఫౌండర్ కేఐ వరప్రాద్ రెడ్డి కూడా కలిశారు. ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయిన అనంతరం చాగంటి కోటేశ్వరరావు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న గోశాలను సందర్శించారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని చాగంటి జగన్ ను కొనియాడారు.


Tags:    

Similar News