Big ‍Breaking : ఆ ఇద్దరి ఎమ్మెల్సీలపై వేటు.. ఎన్నికల వేళ సీరియస్ డెసిషన్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇద్దరు శాసనమండలి సభ్యులపై అనర్హత వేటును ఛైర్మన్ మోషేన్ రాజు వేశారు

Update: 2024-03-12 03:23 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇద్దరు శాసనమండలి సభ్యులపై అనర్హత వేటును ఛైర్మన్ మోషేన్ రాజు వేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి.రామచంద్రయ్యలను అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీకృష్ణ యాదవ్ స్థానిక సంస్థల కోటా నుంచి గవర్నర్ కోటాలో సి. రామచంద్రయ్య ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు.

వాదనలను విన్న తర్వాత..
అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. సి. రామచంద్రయ్య టీడీపీ గూటికి చేరుకున్నారు. ఇద్దరు పార్టీ మారడంతో పాటు వైసీపీ పై ఆరోపణలు చేస్తుండటంతో వారిపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్ కు వైసీపీ నాయకత్వం పిటీషన్ లో విజ్ఞప్తి చేసింది. ఇరువురి వాదనలను పరిశీలించిన తర్వాత, సమగ్ర విచారణ జరిపిన తర్వాతనే శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.


Tags:    

Similar News