Chandrababu : బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది

Update: 2024-01-24 06:34 GMT

 telugu desam party chief chandrababu naidu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టు లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేసింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ...
ఏపీ హైకోర్టు ఇటీవల ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్ స్కామ్, ఇసుక కుంభ కోణాల కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆయనపై వరసగా ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈకేసులన్నింటిలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.


Tags:    

Similar News