పోలీసు వలయంలో విజయవాడ
చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. జిల్లా కేంద్రాల నుంచే ఉద్యోగులను విజయవాడ రాకుండా అడ్డుచెబుతున్నారు
చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జిల్లా కేంద్రాల నుంచే ఉద్యోగులను విజయవాడ రాకుండా అడ్డు చెబుతున్నారు. రైల్లేస్టేషన్లు, బస్టాండ్లు, రహదారులపై తనిఖీలు ముమ్మరం చేశారు. గుంపుగా ఒక వాహనంలో వెళుతున్న ఉద్యోగులను ఆపి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. దీంతో ఉద్యోగులు పోలీస్ స్టేషన్ల ముందే రాత్రంతా ఆందోళన నిర్వహించారు.
ఎక్కడికక్కడ అడ్డుకుంటూ...
పీఆర్సీని రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ఈరోజు చలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈకార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వ లేదు. ఉద్యోగ సంఘాల నేతలను ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేశారు. విజయవాడకు వచ్చే అన్ని మార్గాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అయినా కొందరు బస్సుల్లో సొంత వాహనాల్లో విజయవాడకు చేరుకోగలిగారు. ఈరోజు బీఆర్టీఎస్ రోడ్డపై వాహనా రాకపోకలను నిషేధించారు. చలో విజయవాడ కార్యక్రమంలో టెన్షన్ నెలకొంది.