రేపటి చంద్రబాబు, పవన్ పర్యటన రద్దు

రేపటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి పర్యటన రద్దయింది. రేపు విజయనగరం, నెల్లిమర్ల ఇద్దరూ ఉమ్మడి పర్యటన చేయాల్సి ఉంది.;

Update: 2024-04-15 06:26 GMT
రేపటి చంద్రబాబు, పవన్ పర్యటన రద్దు

janasena chief pawan kalyan will go to tdp chief chandrababu's house today.

  • whatsapp icon

రేపటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి పర్యటన రద్దయింది. రేపు విజయనగరం, నెల్లిమర్ల ఇద్దరూ ఉమ్మడి పర్యటన చేయాల్సి ఉంది. ఈ మేరకు పార్టీ ముందుగానే ప్రకటించింది. అయితే రద్దుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు కానీ ఇద్దరి ఉమ్మడి పర్యటన మాత్రం రేపు రద్దయినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఎల్లుండి పర్యటన యధాతధం...
అయితే ఈ నెల 17వ తేదీన జరగబోయే పెడన, మచిలీపట్నం ఉమ్మడి బహిరంగ సభల్లో యధాతథంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాంధ్ర లో పర్యటన రద్దయింది కానీ, కోస్తాంధ్ర లో మాత్రం ఇద్దరు ఒకే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.


Tags:    

Similar News