మధ్యంతర బెయిల్ పిటీషన్ వాయిదా

చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ ను విచారణను వాయిదా వేసింది.

Update: 2023-09-15 06:44 GMT

చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన ఏసీబీ న్యాయస్థానం విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు పిటీషన్ వేశారు. ఎపీఎన్‌ఎస్‌డీసీ ఛైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో కూడా తన పేరు లేదని, ఎఫ్ఐఆర్ లో కూడా తొలుత తన పేరు నమోదు చేయలేదని చంద్రబాబు పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బెయిల్ తో పాటు మధ్యంతర పిటీషన్లను కూడా విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

రాజకీయ ప్రేరేపిత కేసంటూ...
ఈ పిటీషన్ విచారణ సందర్భంగా ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని కూడా చంద్రబాబు తరుపున న్యాయవాదులు వాదించారు. చంద్రబాబు పేరు ఎప్పుడు చేర్చారో కనీసం సీఐడీ అధికారులు చెప్పడం లేదని అన్నారు. ఆధారాలు లేకుండానే ఆయనను అరెస్ట్ చేశారని చెప్పారు. కేసు నమోదు చేసిన ఇరవై రెండు నెలల తర్వాత తనపై ఆరోపణలు చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. అయితే సీఐడీ తరుపున న్యాయవాదులు కూడా గట్టిగా వాదించారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని, ఆయన ప్రోద్బలంతోనే స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటయిందని, మంత్రివర్గం ఆమోదం లేకుండా దీనిని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 19వ తేదీకి విచారణను వాయిదా వేసింది.


Tags:    

Similar News