ప్రశ్నించినందుకే దాడులు చేస్తారా?

కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల్లో బాధ్యులయిన వారిని అరెస్ట్ చేయాలని చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు.

Update: 2022-01-11 03:02 GMT

కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల్లో బాధ్యులయిన వారిని అరెస్ట్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. అక్రమ మైనింగ్ ను ప్రశ్నించినందుకే ఈ దాడులు జరిగాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దాడికి గురైన వారు కనీసం ఆసుపత్రికి తరలించకుండా కూడా వైసీపీ మూకలు అడ్డుకున్నాయని చంద్రబాబు ఆరోపించారు.

చర్యలు తీసుకోవాలని.....
వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ను అధికార పార్టీ నేతలు యధేచ్ఛగా కొనసాగిస్తున్నారని చెప్పారు. దానిని ప్రశ్నించినందుకే టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు.


Tags:    

Similar News