ప్రజల్లోకి చంద్రబాబు.. ఎప్పటి నుండి అంటే?

తెలంగాణ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు

Update: 2023-12-02 10:59 GMT

తెలంగాణ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరయింది. హైకోర్టుతో పాటు, సుప్రీంకోర్టు కూడా ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ జనం లోకి రావాలని అనుకుంటూ ఉన్నారు. డిసెంబర్ 10 నుంచి ఆయన జిల్లాల పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. అంతకు ముందే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవాలని భావిస్తున్నారు. ఏపీలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో ఆయన బిజీగా ఉండనున్నారు. త్వరలోనే ఆయన పర్యటనలకు సంబంధించి టీడీపీ షెడ్యూల్ ను విడుదల చేయనుంది.

విజయవాడలో చంద్రబాబు:
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గమ్మ గుడికి ఆయన భార్యతో కలిసి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నాక బయట మీడియాతో మాట్లాడారు. తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని, అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, దుష్టశక్తులు అడ్డుకున్నా తన పయనం ఆగబోదని స్పష్టం చేశారు. మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు ఉండాలని, అందుకే తాను ఈ యాత్ర చేపట్టానని చెప్పారు. దుష్టుల నుంచి సమాజాన్ని రక్షించాలని శక్తి స్వరూపిణి కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News