చంద్రబాబు కాన్వాయ్ రూట్ మార్చిన పోలీసులు

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు

Update: 2023-09-09 05:26 GMT

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. బేస్తవారిపేట నుండి ఒంగోలు వైపు మళ్లింది వాహన శ్రేణి. బేస్తవారిపేట, పొదిలి, దర్శి, అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు మీదుగా విజయవాడ తీసుకెళ్ళనున్నారు పోలీసులు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్ట్‌ చేసింది ఏపీ సీఐడీ. ఆయన తన సొంత కాన్వాయ్ లో వస్తానని చెప్పటంతో పోలీసులు అంగీకరించారు. విజయవాడలో మూడో అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబు నాయుడిని హాజరు పర్చనున్నారు. ఈరోజు శనివారం కావటంతో పాటు జాతీయ లోక్ అదాలత్ ఉండటంతో.. చంద్రబాబును కోర్టులో హజరుపరుస్తారా..? లేక న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరుస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.


Tags:    

Similar News