రాయలసీమలో నిరుద్యోగులకు తీపికబురు.. ఇక ఉద్యోగాలు వచ్చినట్లే
రాయలసీమలో నిరుద్యోగ యువకులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.;

రాయలసీమలో నిరుద్యోగ యువకులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాయలసీమ యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు చంద్రబాబు ఎక్స్ లో వెల్లడించారు. కుప్పంలో గ్రీన్ స్కిల్స్ అకాడమీ, కెరీర్ రెడీనెస్ సెంటర్ ను అమెరికాకు చెందిన ఒక మిలియన్ ఒక బిలియన్ సంస్థ ప్రారంభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు 'ఎక్స్' వేదికగా తెలిపారు.
ప్రతిభావంతులైనవారికి...
రాయలసీమలో ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగ నైపుణ్యాలు కల్పించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. అమెరికా సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంస్థ ద్వారా యాభై వేల మందికి శిక్షణ అందించనున్నట్లు సీఎం చంద్రబాబు 'ఎక్స్'లో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో వందమంది పారిశ్రామికవేత్తలను తయారుచేయడంతో పాటు.. 30వేల మంది యువతకు ఉద్యోగాలు, ఇంటర్నిష్ కల్పిస్తారని వివరించారు.