సంపద సృష్టించే సంస్థలకే భూ కేటాయింపులు : చంద్రబాబు
అమరావతిలో సంపద సృష్టి కేంద్రాలుగా మార్చే వారికి భూకేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు;
అమరావతిలో సంపద సృష్టి కేంద్రాలుగా మార్చే వారికి భూకేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో జరిగిన భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేయాలని ఆయన అభప్రాయపడ్డారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు మాత్రమే భూకేటాయింపులు జరపాలని ఆయన అన్నారు.
టాప్ టెన్ కళాశాలలు...
దేశంలోనే టాప్ టెన్ స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు అమరావతిలో ఏర్పాటు కావాలని, గతంలో గుర్తించిన 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాజధాని ఉంటుందని చంద్రబాబు తెలిపారు. మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలు పునరుద్ధరించాలని అన్నారు. ఐఆర్ఆర్, నాలుగు లైన్లుగా కరకట్ట నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.