ఆత్మకూరులో వైసీపీ ఓట్లు తగ్గాయి
ఆత్మకూరు ఉప ఎన్నికలలో డబ్బులు పంచినా వైసీపీకి ఓట్లు పెరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
ఆత్మకూరు ఉప ఎన్నికలలో డబ్బులు పంచినా వైసీపీకి ఓట్లు పెరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీనియర్ నేతలతో జరిగిన టెలికాన్షరెస్స్ లో ఆయన మాట్లాడారు. ఆత్మకూరులో టీడీపీ పోటీలో లేకపోయినా గత ఎన్నికలకంటే ఓట్లు పెరగేలేదన్నారు. దీన్ని బట్టి ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని చెప్పవచ్చన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే వైసీీపీకి ఆత్మకూరు ఉప ఎన్నికలో కనీసం పది వేల ఓట్లు కూడా అదనంగా పడలేదని ఆయన అన్నారు.
వాతలు.. కోతలు...
దీనికి ప్రభుత్వంపై వ్యతిరేకత కారణమని చంద్రబాబు అన్నారు. పన్నులతో వాతలు, పథకాల్లో కోతలు అనేలా జగన్ పాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. నిబంధనల్లో కోతలు పెట్టి పథకాల్లో డబ్బులు మిగుల్చుకుంటున్నారని అన్నారు. అమ్మఒడిలో ఈ ఏడాది 51 వేల మంది లబ్దిదారులకు హాజరు పేరిట కోత విధించారన్నారు. ఒంటరి మహిళల పింఛన్ల విషయంలోనూ 50 ఏళ్లకు వయసు పెంచి మహిళలకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. లబ్దిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.